తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ఎమ్మెల్యేల వినతిపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లోని నాలాల అభివృద్ధి, ప్రక్షాళనలపై విపక్ష సభ్యులు మంత్రిని క్షేత్రస్థాయి పర్యటనకు ఆహ్వానించారు. ఇచ్చిన వాగ్ధానం మేరకు మంత్రి కేటీఆర్ మంత్రులు నాయిని, తలసాని, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు.
Had a busy day visiting Sanat Nagar, Musheerabad & Amberpet constituencies today along with Hon'ble HM Nayini Garu, MLAs & Mayor pic.twitter.com/AnicSPJ29N
— KTR (@KTRTRS) November 21, 2017
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరిన బృందం.. ముషీరాబాద్, నారాయణగూడలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు.అనంతరం బన్సీలాల్‌పేటలో జీహెచ్ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను సందర్శించారు. లోయర్ ట్యాంక్ బండ్ నాలా, దోమల గూడ, చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్, సిటీ సెంట్రల్ లైబ్రరీతో పాటు కవాడిగూడ వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన గృహ సముదాయాలను పరిశీలించారు.
నగరంలోని పలుచోట్ల బన్సీలాల్ పేట తరహాలో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని హోంమంత్రి నాయిని తెలిపారు. దోమలగూడలో సర్కిల్ ఆఫీస్ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ స్థానంలో అధునాతన మార్కెట్ నిర్మాణం చేస్తామని చెప్పారు. అశోక్‌నగర్ లైబ్రరీ డిజిటలైజేషన్‌కు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. అటు స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
Visited & interacted with students at city central library, chikkadpalli. Announced 5 Cr for up-gradation of common amenities pic.twitter.com/Md78HvjXYN
— KTR (@KTRTRS) November 21, 2017
Visited several Nalas enroute & directed town planning officials to remove obstructions, get chain fencing & construct retaining walls pic.twitter.com/0GA7DRDUac
— KTR (@KTRTRS) November 21, 2017
Visited several municipal markets in Musheerabad & Amberpet. Agreed to construct new markets with better amenities for both vendors & people pic.twitter.com/2CVhCnJ9VS
— KTR (@KTRTRS) November 21, 2017
Interacted with GHMC sanitation staff who toil everyday. My ?? to them for doing their best to keep our city clean pic.twitter.com/H9TgWxYfs4
— KTR (@KTRTRS) November 21, 2017
Also inspected the newly built multipurpose community hall in Sanath Nagar & assured the MLAs that same would be replicated across the city pic.twitter.com/pJ86262OWN
— KTR (@KTRTRS) November 21, 2017