Minister @KTRTRS inspected GHMC Multi-purpose Function hall in Musheerabad Assembly Constituency along with Ministers Nayani Narasimha Reddy, Talasani Srinivas Yadav, Mayor @bonthurammohan, MLAs @kishanreddybjp @drlaxmanbjp & @GHMCOnline officials pic.twitter.com/JCcNnhwA9X
— Min IT, Telangana (@MinIT_Telangana) November 21, 2017
జీహెచ్ఎంసీలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరిన మంత్రి కేటీ రామారావు ఈ సందర్భంగా నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. సహచర మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు, మేయర్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ముషీరాబాద్, నారాయణగూడలోని పలు ప్రాంతాలను సందర్శించిన మంత్రి బృందం ఈ సందర్భంగా పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బన్సీలాలపేటలోజీహెచ్ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను మంత్రి కేటీఆర్ సారథ్యంలోని బృందం సందర్శించింది. సిటీ సెంట్రల్ లైబ్రరీ, పలు నాలాలు, మార్కెట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత సిటీ సెంట్రల్ లైబ్రరీకి మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆధునీకరణకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటుగా డిజిటల్ లైబ్రరీగా సిటీ లైబ్రరీని తీర్చిదిద్దుతామని తెలిపారు.
Tags GHMC IT Minister KTR