తెలుగు ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు.. పోసాని కృష్ణ మురళి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై చేసిన విరుచుకుపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఏపీ సర్కార్ ప్రకటించిన నంది అవార్డుల పై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నంది రగడ పై స్పందిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా ముందుకు వచ్చిన పోసాని.. లోకేష్ వ్యాఖ్యల పై తీవ్రంగా స్పందించారు.
లోకేష్ తెలివుండే మాట్లాడుతున్నావా.. చదువుకున్నావా అసలు.. నువ్వు మంత్రి అవ్వడం ఏపీ ప్రజల ఖర్మ అని.. నువ్వే కనుక ముఖ్యమంత్రి అయితే ప్రజలను బ్రతకనిస్తావా.. అవార్డుల ఎంపికలో లోపాలున్నాయి సరిదిద్దుకోమని చెబితే మమల్ని నాన్ లోకల్ అంటావా, లోకేష్ బాబు మనస్తత్వం తెలంగాణ వాళ్లకు ఉంటె మమల్ని పిచ్చి కుక్కల్ని కొట్టినట్లు కొట్టేవాళ్ళు. మత కలహాలు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలను కుంటున్నావా.. అసలు నాన్ ఏపీ వాళ్ళను నంది జ్యూరీలో ఎందుకు పెట్టుకున్నారంటూ నారా లోకేష్ పై ఒక రేంజిలో ఫైర్ అయ్యారు.