Home / ANDHRAPRADESH / లోకేష్ ఆధార్‌ని.. చింపినంత ప‌ని చేసిన పోసాని..!

లోకేష్ ఆధార్‌ని.. చింపినంత ప‌ని చేసిన పోసాని..!

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పై అయితే పోసాని విరుచుకు ప‌డ్డారు. ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శలు చేస్తున్నారంటూ లోకేశ్‌ చేసిన వ్యాఖ్యల పై పోసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం లోకేస్ చేసిన వ్యాఖ్యలతో తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏమిటని ఆయన ప్రశ్నించారు. నంది అవార్డులు లోకేష్ సొత్తా నంది అవార్డులు నీ అబ్బ సొత్తా అంటూ లోకేష్‌ను ప్రశ్నించారు. విమర్శలు చేస్తే స్థానికేతరులు అవుతారా అని ఆయన ప్రశ్నించారు.

ఇక గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా.. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా.. నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా… 2014 వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని.. అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు అని.. ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా.. అంటూ లోకేష్ పై పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీతులు చెబుతున్న లోకేష్‌ని ఒక‌టే అడుగుతున్నా.. హైద్రాబాద్‌లో ట్యాక్స్‌లు కట్టేవారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు.. వారంతా ఇక్కడే ట్యాక్స్‌లు కడుతున్నారు కదా.. మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు.. రాద్ధంతం చేస్తే నందులు తీసేస్తాం అన్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత రాద్ధంతం జరిగింది మరి వారిని ఎందుకు తీసేయలేదు. భారత రత్న, పద్మ అవార్డుల విషయంలో కూడా చాలా సార్లు విమర్శలు వచ్చాయి.. వాటిని తీసేశారా.. అంటూ తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు పోసాని. దీంతో ఏపీ ప‌ప్పు ఆధార్‌ని పోసాని చింపినంత ప‌ని చేశార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు లోకేష్‌ని ఆడేసుకుంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat