గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి మంత్రి పదవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని.. వైసీపీ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని.., ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని అన్నారు. తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ప్రతిపక్షంలో కొనసాగుతున్నారని చెప్పారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కచ్ఛితంగా అవుతారని చెప్పారు. ఇక తనకు మంత్రి పదవి ఈక ముక్కతో సమానమని ఆయన అన్నారు. జగన్ హృదయంలో చోటు ఉంటే చాలని ఆయన అన్నారు. గుడివాడలో తననే అందరికన్నా ఎక్కువ సార్లు గెలిపించారని, తమ పార్టీ అదికారంలోకి వస్తే పులివెందుల మాదిరి ఈ పట్టణాన్ని అబివృద్దిచేస్తానని నాని అన్నారు.
ఇక చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు అంత్యంత మోసపూరితమైన వ్యక్తి అని.. వెన్నుపోటు.. కుట్రలు ఆయన రాజకీయ అర్హతలని.. అవసరమైతే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకునే వ్యక్తి అని మండి పడ్డారు. రాష్ట్రాన్ని ఒక దొంగ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డమైన హామీలిచ్చి మోసం చేసిన వ్యక్తి అని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు 70 ఏళ్ల వయస్సు రావడంతో మైండ్ పనిచేయడం లేదని.. ఆయన ఎప్పుడు పోతారో తెలియదు.. అలాంటి వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మరణిస్తే వారి పుత్రరత్నం లోకేష్ పార్టీని టైటానిక్ షిప్‌ని ముంచినట్లు ముంచుతారని కొడాలి నాని మాటల తూటాలు పేల్చారు.