ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఇయర్స్ అనుభవానికి చుక్కలు చూపిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే జగన్ ప్రారంభించిన పాదయాత్ర సూపర్ డూపర్ హిట్ కావడం.. రోజు రోజుకూ వేల సంఖ్యలో జనం తరలి రావడం.. జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబు పాలనను ఎండగట్టడంతో టీడీపీ బ్యాచ్ మింగలేక కక్కలేక ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి .. జగన్ మీద ఉన్నవి, లేనివి విమర్శలు చేస్తూ తమ పైససికత్వాన్ని చూపిస్తున్నారు.
అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే.. జగన్ పాదయాత్ర పై చంద్రబాబు స్పందిస్తూ.. జగన్ పెద్దగా పాదయాత్రను పట్టించుకోనవసరం లేదని, ప్రజలే పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మేము చేసే అభివృద్ధిని తట్టుకోలేక మా ప్రభుత్వం మీద కేసులు వేస్తున్నారని, అసలు అవి కోర్టులు కూడా వాటిని అంగీకరించడం లేదని తెలిపారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబును అడ్డంగా ఆడేసుపకుంటున్నారు.
జగన్ పాదయాత్రను పట్టించుకోవల్సిన అవసరం లేదనప్పుడు.. మంత్రుల చేత రోజుకు నాలుగు సార్లు జగన్‌ను తిట్టించాల్సిన పని ఏమిటని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా భయం ముందు పుట్టి చంద్రబాబు తరువాత పుట్టాడని అంటారు. భయం లేకపోతే వారి పార్టీ సభ్యులందరూ.. జగన్ తన మానాన తను పాదయాత్ర చేసుకుంటుంటే.. విమర్శలు చేయండం ఎందుకు.. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించడం ఎందుకని.. అసలు ప్రజలు మీ పాలనలో సంతోషంగా ఉంటే.. జగన్ కోసం ఎందుకు వేలల్లో తరలి వస్తారు.. వారి సమస్యలు ఎందుకు చెబుతారని వైసీపీ శ్రేణుల మండి పడుతున్నాయి.