ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి షాక్. బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్లు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. బోటు ప్రమాదంపై నిఘా వర్గాలు తమ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా కారకులైన కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇదే అంశంపై చంద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలో మంత్రి అఖిలప్రియతోపాటు ఓ కీలక శాఖ నేత కూడా అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది ప్రభుత్వ శాఖల వైఫల్యంగా ప్రజల్లోకి బలంగా వెళ్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మరొక్కసారి ఇటువంటి ఘటనలు జరిగితే దాని సంబంధిత అధికారులు, మంత్రులు రాజీనామా చేస్తారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అయితే, మంత్రి అఖిల ప్రియ సమక్షంలో ఈ మాటలు అనడంతో మంత్రి అఖిలప్రియ షాకైంది. చంద్రబాబు వ్యాఖ్యలతో నైతిక బాధ్యత వహించి అఖిల ప్రియ రాజీనామా చేస్తారా..? అది కూడా డౌటే.. అలాగని ముఖ్యమంత్రి అఖిల ప్రియను తప్పిస్తారా.? అంటే అఖిల ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండటమనేది సాధ్యమయ్యేటట్లు లేదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడలి.
