ఆంద్రప్రదేశ్ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భుమా అఖిలప్రియ పై రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు జల్లు కురిపించారు… మంగళవారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లోమాట్లాడారు .ఈ క్రమమలో అయన మాట్లాడుతూ… అఖిల ప్రియ చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. సోషల్ మీడియా సమ్మిట్, బెలూన్ ఫెస్టివల్ లను నిర్వహించడంతో పాటు, వివిధ కార్యక్రమాలతో పర్యాటక రంగాన్ని అఖిలప్రియ ప్రోత్సహించారని అన్నారు .
కేబినెట్ నుంచి అఖిలప్రియను తొలగిస్తున్నారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు . ఇప్పట్లో మంత్రవర్గాన్ని విస్తరించే ఆలోచన లేదని… మీడియాలో వార్తలు రాసేసి, వివరణ అడిగితే ఎలాగని లోకేష్ ప్రశ్నించారు. విజయవాడలో చోటు చేసుకున్న బోటు ప్రమాదం దురదృష్టకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో తమ కుటుంబానికి ఆధార్, ఓటర్ ఐడీ ఉందా? లేదా? అంటూ కొంత మంది వెతుకుతున్నారని… ఏపీలో ఓటు హక్కు లేకపోతే ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ ఎలా అవుతానంటూ ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలోనే తన కుమారుడు దేవాన్ష్ కు కూడా ఆధార్ కార్డు ఉందని చెప్పారు.