ఆడబిడ్డ పుడితేనే కోడల్ని రాచి రంపాన పెట్టె అత్తలున్న నేటి ఆధునిక రోజుల్లో తన కోడలుకి ఆడబిడ్డ పుట్టింది అని ఆమెను ఏమి చేసిందో తెలుసా ..?.తన కోడలికి ఆడబిడ్డ పుడితే కొంతమంది అత్తలు మాదిరిగా వేధించకుండా గిఫ్ట్ నిచ్చింది .అసలు విషయానికి వస్తే యూపీలో తన కోడలు ఆడ పిల్లకు జన్మను ఇచ్చినందుకు ఆమెకు ఒక అత్త హోండా సిటీ కారును బహుమతిగా ఇచ్చింది. రాష్ట్రంలో హమిర్పుర్ జిల్లాలో కుష్భూ అనే ఒక వివాహిత ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఆమెకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా ఆనందించారు. మరోవైపు కుష్బూ అత్త ప్రేమాదేవి ఆనందానికి అయితే అంతే లేకుండా పోయింది. ఆమె ఆ సంతోషంలో బంధుమిత్రులను ఇంటికి పిలిచి పెద్ద పార్టీ కూడా చేసింది.
ఆరోగ్య శాఖలో పని చేసి రిటైరయ్యారు. శిశువు రాకతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆ వివాహిత అత్త చెబుతోంది. తమకింత సంతోషం పంచిన కోడలికి హోండా సిటీ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపింది.
