ఏపీ సర్కారు 2014 ,15 ,16 ఏడాదికి గాను ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెల్సిందే .నంది అవార్డులపై ఇటు సినిమా ఇండస్ట్రీ నుండే కాకుండా అన్ని వర్గాల వారి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .సోషల్ మీడియా మొదలు ప్రింట్ ఎండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు ,సినిమా వర్గాల నుండి రాజకీయ వర్గాల వరకు ,సినిమా విమర్శకుల దగ్గర నుండి రాజకీయ విశ్లేషకుల వరకు అందరు బాబు సర్కారును ఏకిపారేస్తున్నారు .ఇంతటి రాద్దాంతం సృష్టించిన నంది అవార్డులపై ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు స్పందించారు .ఈ రోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉన్నవారు కూడా నంది అవార్డులపై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. నంది అవార్డులపై ఎన్‌ఆర్‌ఏలు మాట్లాడడం ఏమిటని ఆయన విమర్శించేవారిని ప్రశ్నించారు. గతంలో నంది అవార్డులు ఇవ్వని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు కానీ ఇస్తున్న మాపై రాళ్లు విసురుతున్నారని లోకేష్ తెలిపారు. ఏపీలో ఓటరు కార్డు, ఆధార్‌కార్డు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారని, వారిని పాతుకొని కొన్ని మీడియా సంస్థలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని లోకేష్ అన్నారు .
