శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం అయ్యింది. ఓ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టస్ గా పని చేస్తున్న అమ్మాయి… శనివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. పార్కింగ్ ప్లేస్ లో భరత్, కల్యాణ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు కంప్లయింట్ చేసింది. వెంటనే పోలీసులు అక్కడే ఉన్న ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు వీరిని పట్టుకోవటంతో స్వరం మార్చారు. ఆ అమ్మాయిని వేడుకున్నారు. కేసు పెట్టొద్దని.. ప్లీజ్ మేడమ్.. ప్లీజ్ మేడమ్ అంటూ ఒకటికి వంద సార్లు రిక్వెస్ట్ చేశారు. అయినా ఆ అమ్మాయి కనికరించలేదు. దీంతో భరత్, కల్యాణ్ లను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ కూడా చేతులు జోడించి వేడుకున్నారు ఈ యువకులు. పొరపాటు జరిగిందని.. కావాలని మీద పడలేదని దండం పెట్టారు.
అయితే ఆ అమ్మాయి అంతటితో ఆగలేదు. చేసిన తప్పుకి కాళ్లు పట్టుకుని సారీ చెప్పాలని కోరింది. దీనికి కూడా ఆ యువకుడు ఓకే అన్నాడు. అమ్మాయి కాళ్ల ముందు వంగి సారీ చెప్పాడు. అలా కాదు.. బెండ్ డౌన్.. బెండ్ డౌన్.. అప్పుడే వదిలేస్తా అని బెదిరించింది. లేకపోతే కేసు పెట్టి మరీ చంపుతా.. బెండ్ డౌన్.. కాళ్లు పట్టుకో.. కాళ్లు పట్టుకో నువ్వు.. నా కాళ్లకు చేతులు టచ్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ యువకుడు అందరి ముందు కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాడు. ఈ ఘటనపై ఎయిర్ పోర్ట్ ఇన్ స్పెక్టర్ స్పందిస్తూ.. దీనిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు. ఎయిర్ హోస్టస్ కూడా కంప్లయింట్ ఇవ్వలేదన్నారు. అయినాకానీ.. ఈ ఘటనపై విచారణ చేసి న్యూసెన్స్ కేసు నమోదు చేస్తామన్నారు.