ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం కర్నూలు జిల్లాలో హుసేనపురంలో జరిగిన మహిళా గర్జన సదస్సులో ఆమె మాట్లాడుతూ టీడీపీ సర్కారును తూర్పురబట్టారు .
ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న మగవారిని త్రాగుడుకి భానిస చేసి చంపాలనే లక్ష్యంతోనే చంద్రబాబు తుగ్లక్ నిర్ణయాలను తీసుకుంటున్నారు .రాష్ట్రంలోని జాతీయ రహదారులను బార్ల షాపులుగా మారుస్తున్నారు .ఆడవారిపై లైంగిక దాడులు చేస్తున్న కానీ చంద్రబాబు సర్కారు చూస్తూ ఊరుకుంటున్నారు .రాష్ట్రంలో ఉన్న ప్రతి యాబై వేల మందికి ఒకటి చొప్పున ఒక వైన్ షాపును తెరిపించి వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటున్నారు .ఆయనకు బుద్ధి చెప్పాలి .
రానున్న ఎన్నికల్లో జగన్నను ముఖ్యమంత్రిని చేయాలి .అప్పుడే మనపై జరుగుతున్న అఘత్యాలు ఆగుతాయి .రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం .రాజన్న పాలనలోనే మనకు రక్షణ .జగనన్న మాటిస్తే రాజన్న మాటిచ్చినట్లే ..వైసీపీ అధికారంలోకి వస్తే మద్యం నిషేధం చేసి తీరుతాం అని ఆమె హామిచ్చారు మన కోసం పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుని, ఆయన రక్తం పంచిన బిడ్డ జగన్ ను ఆదరించాలని రోజా పిలుపునిచ్చారు .