తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సహచర ఎమ్మెల్యేను కొనబోయి యాబై లక్షల రూపాయలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే .తాజాగా మరోసారి తన ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సంబంధించిన విషయంలో అడ్డంగా దొరికారు .ఇటీవల ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ పదవులకు ,ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .
అంతే కాకుండా ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ శాసనసభ స్పీకర్ కు పంపించాను అని ప్రకటించారు .ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో చేరారు .అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తమకు ఎటువంటి రాజీనామా లేఖ రాలేదు .ఒకవేళ వచ్చినట్లయితే దాదాపు పదహారు రోజులు పాటు జరిగిన శాసనసభ సమావేశాల్లో స్పీకర్ ఆ లేఖను చదివేవారు .రాజీనామా ఆమోదంపై సభలోనే ఒక ప్రకటన వచ్చేది అని స్పీకర్ కార్యాలయం తెలిపింది .
అయితే రాజీనామా చేయడంపై తోకముడిచిన రేవంత్ రెడ్డి తనకు ఒక సభ్యుడుకిచ్చే జీతం ,కేటాయించే క్వార్టర్ ,భద్రతాపరంగా ప్రభుత్వం కల్పించే గన్ మెన్లను వాపసు చేస్తాను అని రేవంత్ రెడ్డి స్పీకర్ కార్యాలయానికి రాశాడు .అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇలా ఎన్ని లేఖలు రాసిన కానీ ఉపయోగం ఉండదు .నిబంధనల ప్రకారం ఒక శాసనసభ్యుడుకి అన్ని సదుపాయాలు కల్పిస్తారు అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు .