Home / MOVIES / ప్రముఖ హీరోయిన్ కి ప్రేమ లేఖ రాసిన కత్తి మహేష్ పరిస్థితి ఏమైందో తెలుసా?

ప్రముఖ హీరోయిన్ కి ప్రేమ లేఖ రాసిన కత్తి మహేష్ పరిస్థితి ఏమైందో తెలుసా?

మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, మ‌హేష్ క‌త్తి మొద‌ట‌గా సినీ విశ్లేష‌కుడిగాను, ద‌ర్శ‌కుడిగాను, అలాగే బిగ్‌బాస్(తెలుగు) మొద‌టి సీజ‌న్‌లో పాటిస్పేట్ చేసిన‌ప్ప‌టికీ రానంత క్రేజ్ ప‌వ‌ర్ స్టార్‌పై, జ‌న‌సేన పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా సెల‌బ్రెటీ అయిపోయాడు. ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తే, మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం, ఇక్క‌డ అంద‌రికి వారి వారి భావాల‌ను చెప్పుకునే అవ‌కాశం ఉంటుంది. నా భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను అడ్డుకునే హ‌క్కు మీకెక్క‌డిది..? అని ప్ర‌శ్నిస్తుంటారాయ‌న‌.

ప‌వ‌ర్‌స్టార్‌పై క‌త్తి మ‌హేష్ వివాద స్ప‌ద వ్యాఖ్య‌లు పీక్ స్టేజ్‌కు వెళ్లిపోవ‌డంతో ఆగ్ర‌హానికి గురైన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌త్తి మ‌హేష్‌పై దాడికి దిగారు. మ‌రికొంద‌రైతే ..బ‌య‌ట ఎక్క‌డ క‌న‌ప‌డినా కొడ‌తామంటూ క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ లైవ్ లైవ్‌లో బెదిరించారు కూడాను. ఏదేమైనా ఇటీవ‌ల కాలంలో సెబ‌బ్రిటీ స్టేట‌స్‌ను బాగానే పెంచుకున్నాడు క‌త్తి మ‌హేష్‌. ఇంకా కుప్తంగా చెప్పాలంటే సుమారు రూ.40 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ప‌బ్లిసిటీ క‌త్తి మ‌హేష్ సొంత‌మైంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

తాజాగా మ‌హేష్ కత్తి ప్రేమ‌లో ప‌డ్డాడు. మ‌హేష్ క‌త్తి ఏమిటి.. ప్రేమ‌లో ప‌డ‌ట‌మేమిటి? అనుకుంటున్నారా? ఇది నిజ‌మండి బాబూ..! ఇంత‌కీ మ‌హేష్ క‌త్తి మ‌దిని ఆ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? ఆమే.. క‌ల‌ర్ స్వాతి. దీంతో కలర్స్ స్వాతికి ఏకంగా ప్రేమ లేఖ రాసేశాడు. మరి దీనిపై సోషల్ మీడియా జనాలు ఎలా స్పదిస్తారో చూడాలి. స్వాతికి కత్తి రాసిన ప్రేమ లేఖ ఎలా ఉందొ కింద చదవండి.
డియర్ స్వాతి,
ఆ మధ్యనేను రాసిన ప్రేమ లేఖ ఇంకా పచ్చిగానే నా మనసులో ఉంది. నీ ప్రతిభకు తగని పాత్రలో నువ్వు కనిపించి కష్టపెట్టిన నా మనసు గాయం మొన్నటివరకు తాజాగానే ఉండేది. కానీ.”లండన్ బాబులు” చూసాను. ముద్దుమాటల స్వాతి ఒక మెచ్యూర్ నటిగా ఎదగడం చూసాను. ఒక్క మాట కూడా అవసరం లేకుండా కళ్ళతో, పెదాలతో, నవ్వుతో, కనుబొమ్మల ముడితో, కనురెప్పల వాల్పుతో, విరిసీ విరియని నవ్వుతో, వంకించిన మెడతో, పదానికి పదానికి మధ్య పాజ్ తో నటించగల ప్రతిభని మళ్ళీ చూసాను. సూర్యకాంతంతో ప్రేమలో పడ్డాను. స్వాతి.. నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను.

మొదట జాలిపడి. తరువాత అభిమానించి సహాయం చేసిన గాంధీ మాటలు రావని చెప్పి మోసం చేశాడని తెలిసిన క్షణంలో, మోసపోయాననే కోపం, అతని నిస్సహాయత మీద జాలి, మూగవాడు కాదనే ఆనందం ఇన్ని భావాల్ని ఒక్క క్షణంలో పలికించగల నటుల్ని వెళ్ల మీద లెక్క పెట్టగలం. ఆ వెళ్లలో మొదట పలికే పేరు ఇప్పుడు నీది.

క్లైమాక్స్ లో గాంధీ పెళ్లి చేసుకుందామా అన్నప్పుడు, ప్రేమో కాదో తెలియని సందిగ్దత, అవధులు లేని అభిమానపు వెల్లువ, ఎక్కడో కాదనాలనే ఆత్మాభిమానం, ఎందుకు వద్దనాలి అనే తీవ్రమైన ప్రేమ. అనుమానం. ఆనందం. సహజమైన సిగ్గు. బిడియాన్ని పక్కకు నెట్టే ఆలోచన. నాకు కావలసింది నాకు తెలుసు అనే ధీమా. నిన్ను నేను నమ్ముతాను అనే భరోసా. ఇన్ని భావాల్ని ఒక్క విరిసివిరియని స్మైల్ లో చెప్పావు చూడు.
హ్యాట్సాఫ్!
అందుకే ఆగలేక. మనసు ఆపుకోలేక, రాసాను ఈ లేఖ. అందుకో ఈ ప్రేమ లేఖ.
ఇట్లు
కత్తి మహేష్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat