టాలీవుడ్ మన్మధుడు ,స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాలవర్మకు తనదైన స్టైల్ లో ఝలక్ ఇచ్చాడు .దాదాపు ఇరవై ఎనిమిదేండ్ల తర్వాత తొలిసారి జోడి కడుతూ ఇరువురు ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా కంపెనీ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ దర్శకుడు రామ్ గోపాలవర్మకు మైండ్ దొబ్బింది .
కానీ నాకు మాత్రం దొబ్బలేదు ..నాకు మైండ్ బాగానే ఉంది అని కౌంటర్ ఇచ్చాడు .అయితే తనకు మాత్రం మైండ్ దొబ్బలేదు కానీ మిగతా విషయాలు ఈ మూవీ విడుదలైన తర్వాత తెలుస్తాయి అని అన్నారు .ఈ మూవీకి సంబంధించిన కథ గురించి మొదటి లైన్ చెప్పినప్పుడు బాగా నచ్చింది .వెంటనే ఓకే చెప్పేశా ..ఆ తర్వాత ఈ మూవీ షూటింగ్ కు ఎప్పుడు పోదామా అని తెగ ఆరాటపడ్డాను .
అందుకే ఇవాళ పొద్దున్నే నాలుగు గంటలకు నిద్ర లేచి రెడీ అయి మూవీ షూటింగ్ కు వచ్చాను అని తెలిపారు .ఇరవై ఎనిమిది యేండ్ల కింద మూవీ హిట్ అవుతుందా లేదా అనేది శివ షూటింగ్ సమయంలో అనుకోలేదు .అట్నే ఇప్పుడు కూడా కంపెనీ మూవీ గురించి అనుకోవడంలేదు .కానీ రామ్ మీద నమ్మకం ఉంది .తప్పకుండ ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ అవుతుంది అని అన్నారు .