ఇవాళ ప్రగతి భవన్లో ముస్లీంలు, మైనార్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మైనారిటీల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం సాయం అందేలా పథకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఉర్దూ భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. దీని కోసం మహారాష్ర్టాకు ఒక బృందం తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కోరారు.ఉర్దూ అధికారుల నియామకంపై 40 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. పోటీ పరీక్షలు ఉర్దూలో రాసే అవకాశం కల్పించాలని అధికారులకు ఆదేశించారు.