తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని ప్రశ్నించిన వారికి చెంపపెట్టు సమాధానం. నాటి పాలకుల అడ్డగోలు పనులను చక్కదిద్దుతూ స్వరాష్ర్టాన్ని సరైన బాటలో నడుపుతున్న దూరదృష్టికి నిదర్శనం తాజా సంఘటన. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కోత్తగూడ రిజర్వు ఫారెస్ట్ లో పాల పిట్ట సైక్లింగ్ పార్క్. తాజాగా ఈ పార్క్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రికేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 2006లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ పార్టీ ఈ పార్క్ ని 3 ప్రైవేట్ సంస్థలకు అప్పగించగా…అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. 2015 అక్టోబర్ లో ప్రైవేట్ కేటాయింపులను రద్దు చేశామని తెలిపారు. 274 ఎకరాల పార్క్‌ను గతంలో డంపింగ్ యార్డ్ గా చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ అటవీశాఖ అధికారులు 7వేల 5వందల మొక్కలు నాటి పార్కు రూపు రేఖలు మార్చి ఆహ్లాదాన్ని, అందాన్ని నగరానికి అందించారని మంత్రి తెలిపారు.
తెలంగాణలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 12జూలై 2017లో ఇక్కడే హరితహారం కార్యక్రమం ప్రారంభించామని గుర్తు చేశారు దేశవ్యాప్తంగా హరితహారం పై చర్చ జరుగుతోందని, ఆకుపచ్చదనం పెంచడంలో ఇతర రాష్ర్టాలకు తాము ఆదర్శంగా ఉన్నామన్నారు.
Post Views: 287