ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి తన అమాయకత్వాన్ని ,రాజకీయఅనుభవలేమిని ప్రదర్శిస్తూ మరోసారి నోరు జారారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది రాష్ట్రానికి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా .
తీరా అధికారంలోకి వచ్చి నాలుగు ఏండ్లు అయిన కానీ దాని ఊసే లేకుండా ప్రత్యేక ఫ్యాకేజీ ఇస్తున్నామని చేతులు దులుపుకుంది .ప్రత్యేక హోదా పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగు ఏండ్లుగా చేయని పోరాటం లేదు .ధర్నాలు రాస్తోరోకులు ,ఢిల్లీలో అన్ని పోరాటాలు చేసింది .ప్రస్తుతం చేస్తూనే ఉంది .తాజాగా ఈ రోజు సోమవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో టీడీపీ ,బీజేపీ సర్కారు విఫలం కావడంతో అఖిలపక్షం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది .
దీంతో టీడీపీ సర్కారు అఖిలపక్ష నేతలను ,సామాన్య ప్రజలను ఎక్కడక్కడికి అరెస్ట్ చేసి కట్టడి చేయడానికి విఫలప్రయత్నం చేస్తుంది .ఈ విషయం గురించి నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఇక్కడ ఢిల్లీలో ధర్నాలు చేయాలనీ ఆయన హితభోద చేశారు .అయితే గతంలో ఎన్నికల హమిచ్చి తుంగలో తొక్కిన టీడీపీ ఇప్పుడు ఆ హామీపై పోరాడకుండా కేంద్రంతో మిలాకత్ అయి ఇలా లోకేష్ మాట్లాడటం అతని రాజకీయ అనుభవలేమికి నిదర్శనం ..ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియని అమాయకుడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .