తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై వరంగల్ అర్బన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర మేయర్ నరేందర్ ఫైర్ అయ్యారు..ఈ క్రమంలో అయన మాట్లాడుతూ అవినీతికి ,కబ్జాల గురించి కాంగ్రేస్ మాట్లాడటం హాస్యాస్పదం..ముఖ్యమంత్రి కేసీఆర్ కమిట్మెంట్ కలిగిన నాయకుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి కాంగ్రేస్ నాయకులకు లేదు..మంత్రి కేటీఆర్ కార్టూన్ కాదు కడిగిన ముత్యం ..కార్టూన్ లా ప్రవర్తిస్తున్నది కాంగ్రేస్ నేతలే.మంత్రి కేటీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఒక యూత్ ఐకాన్ గా మారారు..
ఐటీలో ఆయన చేస్తున్న కృషిని దేశమే మెచ్చుకుంటుంటే ఈ కాంగ్రేస్ నాయకులకు అది కనపడటం లేదు..అధికారం కోల్పోయామనే అక్కసులో ఏదేదో మాట్లాడుతున్నరు..కాంగ్రేస్ కళ్ళకు ఉన్న గంతలు తీసి చూస్తే నగర అభివృద్ది కనపడుతుంది..ఏనాడూ కాంగ్రేస్ నగర అభివృద్దిపై కాన్సన్ ట్రేట్ చేయలేదు..ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ 2019లో అఖండ విజయం సాదిస్తారు..అయనపై ఆరోపణలు అర్దరహితం..టికెట్ వస్తుందో లేదో అన్న ఆందోళనలో కాంగ్రేస్ నేతలు ఆగం ఆగం మాట్లాడుతున్నరు..
తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ప్రజలు తమను మర్చిపోతున్నారనే ఆందోళనలో కాంగ్రేస్ చౌకబారు విమర్శలు చేస్తుంది.ఎవరో ఇస్తే తెలంగాణా రాలేదు,కేసీఆర్ నాయకత్వంలో ప్రజలను ఐక్యం చేసి పోరాడితే తెలంగాణా వచ్చింది..మేమే తెచ్చాం అని కాంగ్రేస్ చెప్పుకోవడం హాస్యాస్పదం..అడ్డగోలు విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరు,ప్రజలకు వాస్తవాలు తెలుసు…కాకతీయ యూనివర్సిటీ భూములు కొల్లగొట్టిందెవరో ప్రజలకు తెలుసు..మంచి సమయంలో గుర్తుచేసావు.త్వరలో విచారణకై కలెక్టర్ అద్యక్షతన కమిటీ వేసి గత 10ఏండ్ల కాంగ్రేస్ పాపాలు భయటపెడతాం అని ఆయన అన్నారు ..