తెలంగాణ ప్రజల కలలు కన్న బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొలిశెట్టిగూడెంలో గల మున్నేరుపై రూ.13.40కోట్లతో చెక్‌డ్యాం కం వంతెన నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వారం, పది రోజులు ప్రయోగత్మకంగా 24గంటల విద్యుత్ వ్యవసాయానికి సరఫరా చేశామని, ప్రయత్నం దిగ్విజయం కావడంతో నూతన సంవత్సరం నుంచి 24గంటల కరెంట్ సరఫరా చేస్తామన్నారు. సాధించకున్న రాష్ట్రంలో అటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంత రైతులకు మూడు పంటలు పండే విధంగా తగు ప్రణాళికలు రూపొందించే భాగంలోనే చెక్‌డ్యాంలు, ఎత్తిపోతల పథకాలు నిర్మాణం జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అడిగిన వెంటనే నిధులు కేటాయించి, అనతికాలంలోనే భక్తరామదాసు ఎత్తిపోతల పథకంగా నామకరణ చేసి సీఎం కేసీఆర్ చేత ప్రారంభించినట్లు తెలిపారు. కృష్ణ బేసిన్‌లో నీళ్లు సరిపడాలేనందు వల్ల దానికి ప్రత్యామ్నాయంగా కళ్ల మందే ఆంధ్రాప్రాంతానికి తరులుతున్న వర్షపు నీటిని ఓడిసి పట్టేందుకు మున్నేరు, ఆకేరు, పాలేరులో రూ.95కోట్ల వ్యయంతో ఆరు చెక్‌డ్యామ్ కం వంతెనలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
