తెలంగాణలో సాగునీటి రంగం అవసరాలపై విశేష పరిజ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకాలం నాటి నుంచే..రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు వేశారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అబివృద్ది శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు మిర్యాలగూడలో జరుగుతున్న సాగర్ ఆయకట్టు ” రభీ 2017-18నీటి విడుదల ప్రణాళిక ” పై జరుగుతున్న వర్క్ షాప్ కు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅథిది గా హాజరైనారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిందే తడవుగా తెలంగాణలోని ప్రతి ఇంచు భూమినీ సాగులోకి తెచ్చెందుకు ముఖ్యమంత్రి కెసియార్ తపన పడుతున్నారని అయన చెప్పారు.భవిష్యత్ లో ఆలమట్టి, సాగర్ నుండి ఎడమ కాలువ కింద రైతాంగానికి నీరు అందడం కష్టం అన్న కోణంలోనే మూసి నుండి ఎడమ కాలువకు నీరందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు.
తెలంగాణ రైతాంగానికి మేడిగడ్డ జీవనాధారంగా మారబోతున్నదని అయన చెప్పారు.నాగర్జున సాగర్ ఆయకట్టు రైతాంగం కోరుకున్న పద్దతుల్లోనే రభీ పంటకు నీటి విడుదల ఉంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. సాగర్ ఏడమకాలువల కింద మొదటి ఎకరాతో సమానంగా చివరి ఎకరాకు నీరందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ర్ సంకల్పం అని అయన పేర్కొన్నారు. అందుకు ఇంజినీర్లను మరిపించే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలను రూపొందించారని అయన తెలిపారు. ఉద్యమ కాలంలో కోదాడ నుండి హాలీయ వరకు నాడు ఉద్యమ నాయకుడిగా జరిపిన పాదయాత్రలో ఎడమ కాలువ రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యయనం చేశారన్నారు. వాటి పరిష్కారాలను అమల్లో చూపిస్తున్నారని అన్నారు.
ఇకపై తేలాండ్ అన్న పదమే ఉచ్ఛారణలో లేకుండా రెండు పంటలకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్దం అయ్యాయని మంత్రి తెలిపారు. డిజైన్ డిచ్చార్జ్ పద్దతిలో నీటిపారుదల ఉంటుందన్నారు.ప్రాజెక్ట్ ల మొదటి ప్రాధాన్యత త్రాగు నీరు కే ఉంటుందనీ, త్రాగు నీటి వంకతో తెలంగాణ ఏర్పడి కొత్త ప్రబుత్వం ఏర్పడ్డ తొలి మూడు సంవత్సారాలుగా రెండు పంటలకు నీరందించిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.చివరి భూముల రైతాంగం నీటి పారుదల విషయంలో ఎటువంటి అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.చివరి ఎకరాకు నీరందించిన మీదటనే మొదటి ఎకరాకు నీటిపారుదల ఉంటుందన్నారు.సాగర్ ఎడమ కాలువ చివరి మేజర్ ముక్త్యాల నుండి మొదటి మేజర్ రాజవరం రైతాంగం పండుగ వాతవరణంలో రెండో పంట పండిచ్చూకోవచ్చు అన్నారు.ముక్త్యాల చివరి మేజర్ నుండి మొదటి మేజర్ వరకు తానే స్వయంగా పర్యటించనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.
ఎడమ కాలువ మీదే ఆదారంగా వ్యవసాయం చేసుకుంటున్న ఖమ్మం జిల్లా రైతాంగం అందోళనకు గురి కావలసిన అవసరం లేదన్నారు.మొదట పాలేరు నుండి నీరందించి అదే క్రమంలో ఇక్కడి నీరు పాలేరుకు అందించే విదంగా చర్యలుంటాయన్నారు.నీటి పొదుపుకు ప్రతి ఒక్కరు సిద్దం కావాలని అయన పిలుపు నిచ్చారు.నీటి పారుదలవిషయంలో ఒక్క అధికారులనే నిందించి ప్రయోజనం లేదన్నారు.అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను,ప్రజలను భాగస్వామ్యం చెయ్యగలిగినప్పుడే ఫలితం ఉంటుందన్నారు.గతంలో నీటి పారుదల విషయంలో అధికారులను అడిగిన పాపాన పోయిన ప్రజాప్రతినిధి లేడన్న విషయాన్ని అయన గుర్తు చేశారు.ఇంత కాలంగా పడ్డ కష్టాలను అధ్యయనం చేసిన మీదటనే ప్రజలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ తరహ వర్క్ షాప్ లు నిర్వహించూకుంటున్నామన్నారు.లిఫ్ట్ ల సమస్యల పరిష్కారానికి గాను టీఎస్ ఇరిగేషన్ చైర్మన్ తో త్వరలో మిర్యాలగూడలో ఒక సెమినార్ నిర్వహించి సమస్యలను పరిష్కరించ గలమన్నారు.