మెగా కుటుంబానికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. చరణ్, ఉపాసనలకు ఒక విషయంలో చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడని చరణే స్వయంగా చెప్పడంతో సర్వత్రా ఆశక్తి నెలకొంంది. ఇంతకీ ఏవిషయంలో అంటే.. చెర్రి, ఉపాసనలు ఇద్దరూ జంతు ప్రేమికులు కావడంతో.. చిరు ఇంట్లో మునుషులు కంటే జంతువులే ఎక్కువైపోతున్నాయట. దీంతో ఇలా అయితే మిమ్మల్ని బయటకి పంపించేస్తానని చిరు వార్నింగ్ ఇచ్చాడట.
అయితే చెర్రి దంపతులు ఇద్దరూ చిరు ఇచ్చిన వార్నింగ్‌ను పట్టించుకోకుండా.. తరచుగా కొత్త జంతువులు ఇంటికి తెస్తూనే ఉన్నారట. అంతే కాకుండా.. జంతువుల కోసం ఓ కొత్త ఫామ్ హౌస్ ఏర్పటు చేయాలనీ అనుకుంటున్నారట చెర్రి దంపతులు. ఈ విషయాలన్నీ చెర్రీనే చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. చిరు నటించనున్న సైరా నరసింహా రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్క నున్నా సైరా చిత్రం త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది.