ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో రచ్చ లేపిన నంది అవార్డ్స్ రగడ పై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు నంది అవార్డుల ప్రకటనపై ఇంత వివాదం రేగుతుందని అనుకోలదట. వివాదాన్ని ముందే ఊహించుంటే అవార్డుల ఎంపికకు కూడా జ్యూరి విధానం బదులు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంబించి ఉండేవారట.
ఇక ప్రతీ విషయానికీ కులం రంగు పులిమేస్తున్నారంటూ తెగ బాధపడిపోయారట. జ్యూరి నిర్ణయం మేరకే నంది అవార్డులను ప్రభుత్వం ప్రకటించందని చంద్రబాబు అన్నారు. ఇక జగన్ పాదయాత్ర పై కూడా స్పందించిన బాబు అస్సలు పట్టించుకోవడం లేదట.. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. నంది అవార్డుల పై రగడ బాబు సెవెంత్ సెన్స్ ఊహకి అందలేదా.. బోటు ప్రమాదాన్ని బాగానే పక్కదారి పట్టించారని చంద్రబాబు అండ్ బ్యాచ్ చేస్తున్న చిత్రాలు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని బాబు గారి పై సెటైర్లు వేస్తున్నారు.