తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మరో విశేష గౌరవం దక్కింది. తెలంగాణ బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఎంపీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్ ఎన్నికయ్యారు.
న్యాయవాది ఆర్.మహదేవన్ సంఘం న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు.హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిన్న సమావేశమై ఈ మేరకు తీర్మానించింది. ఇదిలా ఉండగా ఎంపి కవిత సంఘము అధ్యక్షులు గా వ్యవహరిస్తున్నారు. ఆమె నాయకత్వం లో సంఘం పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. సంఘము గౌరవ కార్యదర్శి మోహన్ రావు తో పాటు మిగతా కార్యవర్గం యధావిధిగా కొనసాగుతుంది.