ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫొటో వైఎస్ భారతి పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి మొదట ఒక నకిలీ ఫొటో పోస్ట్ అవడం.. దాని పై నిజనిజాలేంటో తెలుసుకోకుండా ఆంధ్రజ్యోతి వెంటనే.. జగన్ అనుకుని సాక్షాత్తూ వైఎస్ భారతే పొరపాటు పడ్డారా.. జగన్‌ను ఆయన భార్యే గుర్తించలేకపోయారా.. జగన్‌లా ఉన్న ఆ వ్యక్తి ఎవరు.. అంటూ కొంచెం మసాలా జోడించి ఒక చెత్త కథనాన్ని ప్రచురించింది.
దీంతో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ భారతిరెడ్డి ఖండించారు. తనకు అసలు ట్వీటర్లోగాని, ఫేస్బుక్లోగాని అకౌంట్లు లేవని స్పష్టంచేశారు. తన పేరుతో ఎవరైనా నకిలీ ఖాతా సృష్టించి ఉంటారేమో తనకు తెలియదన్నారు. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం పూర్తిగా తప్పుడు వార్త అని ఆమె మండి పడ్డారు. అయినా సోషల్ మీడియాలో ఎవడో ఏదో ఫేక్ పోస్టు పెడితే దానిని తీసుకుని ఒక వార్తగా రాయండం ఎంత వరకు కరెక్టు.. నెంబర్ వన్ దమ్మన్న ఛానల్ అని చెప్పుకునే ఆంధ్రజ్యోతికి ఒక మహిళను కించ పరుస్తూ.. మసాలా టైలిల్ పెట్టి జగన్ పై ఉన్న కుళ్ళును మరోసారి బయట పెట్టిందని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.