ఏపీలో వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 13వ రోజు షెడ్యూల్ విడుదలైంది. 13వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు బనగానపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు. ఉదయం 8.30 గంటలకు ఆయన బాతులూరుపాడు చేరుకుంటారు. అక్కడినుంచి పాదయాత్ర కొనసాగిస్తూ ఉదయం 9.30 గంటలకు ఎన్నకొండ మీదుగా 10.30 గంటలకు హుస్సైనపురం చేరుకుంటారు. హుస్సైనపురం చేరుకొనే ముందు ఉదయం 10 గంటలకు ఆయన మహిళ సదస్సులో పాల్గొంటారు. హుస్సైనపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం 3 గంటలకు హుస్సైనపురం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. 3.3 గంటలకు ఆయన పాలుకూరు క్రాస్‌రోడ్డు చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ.. సాయంత్రం 4 గంటలకు గోవిందదిన్నె చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు డోన్ నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశిస్తోంది. బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద వైఎస్ జగన్‌కు డోన్ నియోజకవర్గ పార్టీ నేతలు, ప్రజలు ఘనస్వాగతం పలుకుతారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయన గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో మాట్లాడతారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్ జగన్ బస చేస్తారు.