ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటర్లు విదేశాలను తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పై ద వర్మ కామెంట్లు చేశారు. త్వరలో ఇవాంకా జీఈఎస్ (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమిట్) నిమిత్తం హైదరాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వర్మ ఆమెపై ఫేస్బుక్లో కామెంట్స్చేస్తూ.. ఆమెను బాలీవుడ్ నటి సన్నీలియోనీతో పోల్చారు.
నాకు రాజకీయాలపై ఎలాంటి జ్ఞానం, అవగాహన లేదు. ఇవాంకా హైదరాబాద్‌లో ఎందుకు పర్యటించాలనుకుంటోందో నాకు అర్థం కావడంలేదు. కానీ నేను మాత్రం ఆమె అందాన్ని చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నాను. గతంలో సన్నీలియోన్ భారత్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చాలా థ్రిల్లయ్యాను అని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు వర్మ. నవంబర్ 28న హైదరాబాద్‌లో జరగబోయే జీఈఎస్ సమావేశానికి ఇవాంకా హాజరుకాబోతున్నారు.