తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్ కు తాళం వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం టీడీపీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు .
అందులో ఒకరు బీసీ సంఘం సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య ,మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య .అయితే సత్తుపల్లి నియోజక వర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన త్వరలోనే అంటే వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదో తారీఖున టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .స్థానిక మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు కు అత్యంత ఆప్తుడు అయిన సండ్ర ఆయన ప్రోద్భలంతోనే పార్టీ మారుతున్నారు అని సోషల్ మీడియాలో ,ఆన్లైన్ వెబ్ మీడియాలో వార్తలు తెగ ప్రచారం జరుగుతుంది .
అయితే వెంకటవీరయ్య పార్టీ మారే అవాశం లేదని రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం .గతంలోనే ఒక్కసారి పార్టీ మారతారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ పార్టీ అధినేత ,ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని పిలిచి మరి టీటీడీ పదవి కట్టబెట్టడమే కాకుండా ఏపీలో పలు ప్రాజెక్టులను చేయడానికి అనుమతిచ్చారు అని అప్పట్లో తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకున్నారు కూడా .చూడాలి మరి సండ్ర పార్టీ మారుతున్నారు అని వస్తోన్న వార్తల్లో వాస్తవం ఎంతో ..?