ఏపీ లో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు పలు అక్రమాలకు ,అవినీతికి పాల్పడుతున్నారు .దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుతమ్ముళ్ళు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏకంగా బుక్ నే విడుదల చేశారు .తాజాగా రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్ గేదెల లక్ష్మీ గణేశ్వరరావు ఆస్తులపై శనివారం ఒకే సమయంలో అన్ని చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు .
మొత్తం పదిహేడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా సర్వేయర్ వెలుగులోకి వచ్చిన అక్రమ ఆస్తుల విలువ మొత్తం ఐదు వందల కోట్లకుపైగా ఉంటది అని సమాచారం.అయితే ఈ సర్వేయర్ జిల్లాలో కురుపాం మండలంలో వలసబల్లేరు గ్రామ సర్పంచ్ ఆరిక విప్లవ్ కుమార్ కు బినామీగా సిట్ అధికారులు గుర్తించడంతో ఏసీబీ అధికారులు అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు .ఈ క్రమంలో ఆయన పేరిట ఉన్న పలు బ్యాంకు ఖాతాలను ,లావాదేవీలను ,భూములు రిజిస్ట్రేషన్ల పత్రాలను తనిఖీ నిర్వహించారు .
అంతే కాకుండా చోడవరం తెలుగుదేశం పార్టీ నేత ,స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన మాజీ ఎంపీ గూనూరు వెంకటసత్యనారాయణ (పెదబాబు )ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు .ఇటీవల పెను సంచలనం సృష్టించిన వైజజ్ భూకుంభ కోణంలో తెలుగు తమ్ముళ్ళ పాత్ర ఉంది అని ఏకంగా ఆ పార్టీకి చెందిన మంత్రే స్వయంగా ఆరోపిస్తున్న తరుణంలోనే యాబై ఎకరాలను ఆయన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించడంలో సదరు సర్వేయర్ పాత్ర ఉంది అని సిట్ అధికారులు కేసులు నమోదు చేశారు .అయితే ఈ సర్వేయర్ అధికార పార్టీ నేత యొక్క బినామీ అని ఇటు సిట్ అధికారులు ,అటు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ..