ప్రముఖ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ సహ-వ్యవస్థాపకురాలు, బిల్ గేట్స్ సతీమణి మెలిందా గేట్స్ సంచలన విషయాలను వెల్లడించింది .గత నెల ప్రారంభమైన #metoo ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు .ఇంకా మాట్లాడుతూ ‘నేను కూడా వ్యక్తిగతంగా లైంగిక వేధింపులకు గురయ్యాను.
టెక్ పరిశ్రమలో పనిచేస్తున్నపుడు నాకు ఆ అనుభవం ఎదురైంది. అమెరికాలో మహిళల సమానావకాశాల డేటాను పరిశీలిస్తే దాదాపు 85 శాతం మంది మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురైన విషయం బట్టబయలవుతోంది. నేనూ వాళ్లలో ఒకదాన్నే’ అని ఆమె తెలిపింది.అయితే ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉందని, #metoo ప్రచారం వల్ల ప్రపంచ నలుమూలల నుంచి మహిళలు తమకు జరిగిన అన్యాయం గురించి నోరు విప్పుతున్నారని చెప్పడం గమనార్హం ..
