సందీప్‌కిషన్, మెహ్రిన్ కౌర్‌లు జంటగా నా పేరు శివ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం c/o సూర్య. ఈ చిత్రం తాజాగా నవంబర్ 10న రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో చిత్రం నిడివి తగ్గించారు దర్శకుడు సుశీంద్రన్. ఇందులో భాగంగా హీరోయిన్ కి సంబంధించిన 20 నిమిషాల సన్నివేశాలను తొలగించారు. అయినప్పటికీ మూవీకి స్పందన రాలేదు. దీంతో ఈ మూవీని శుక్రవారం నుంచి ఉపసంహరించుకున్నట్లు దర్శకుడు ప్రకటించారు.
అయితే ప్రస్తుతం ఏయే థియేటర్లలో సినిమా ఆడుతుందో అవే థియేటర్లలో మార్పులు చేసిన సినిమా విడుదల చేస్తామని తెలిపారు. సినిమా సరిగ్గా ఆడకపోతే రద్దు చేసే సాంప్రదాయం ఇదే తొలిసారి. అయితే, తెలుగులో కూడా ఇదే నిర్ణయం అమలు చేస్తారా లేదా అనే విషయం చెప్పలేదు. ఈ సినిమాను తాత్కాలికంగా మాత్రమే ఆపుతున్నామని, సన్నివేశాల్లో మార్పు చేర్పులు చేసి డిసెంబరు 15న మళ్లీ విడుదల చేస్తామని వెల్లడించారు.
వచ్చే నెల 15న ఈ సినిమాను మళ్లీ అదే థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మీడియాకు వివరించాడు. అయితే ఇలా రిలీజ్ అయిన సినిమాను మళ్లీ రెండోసారి థియేటర్లలోకి రిలీజ్ చేయడం ఇంత వరకు ఎప్పుడూ జరగలేదు.. మరీ ఈ సారైనా c/o సూర్యకు లక్ కలిసొస్తుందేమో వేచి చూడాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో తాత్కాలికంగా రద్దుచేసి విడుదల చేసేందుకు ఇక్కడి బయ్యర్లు, పంపిణీదారులు ఒప్పుకుంటారో లేదా అనేది కూడా అనుమానమే. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రయోగం చేసిన దర్శకుడు సుశీంద్రన్ మాత్రమే. ఈ స్టోరీ ని ఎలాగైనా హిట్ జాబితాలోకి చేర్చే దిశగా సుశీంద్రన్ అడుగులు వేస్తున్నాడు.