శిల్పా బ్రదర్స్ అంటే రాష్ట్రంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా జిల్లా రాజకీయాల్లో ,రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు .ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో శిల్పా బ్రదర్స్ లో ఒకరైన శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరపున పోటి చేసి అధికార టీడీపీ పార్టీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి గట్టి పోటిచ్చారు .
తాజాగా బాబు సర్కారు శిల్పా బ్రదర్స్ పై కక్ష్య సాధింపు చర్యలకు దిగింది .అందులో భాగంగా గతంలో వారికి కేటాయించిన గన్ మెన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది .ఆ మేరకు స్థానిక వైసీపీ పార్టీ నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఇన్ చార్జ్ శిల్పా చక్రపాణి రెడ్డి కి ఉన్న 2+2 గన్ మెన్లు ,పార్లమెంటరీ నియోజక వర్గ ఇన్ చార్జ్ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డికి ఉన్న 2+2 గన్ మెన్లు ,రాష్ట్ర మార్క్ ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డికి 1+1 ,మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచనకు 1+1 ఉన్న గన్ మెన్ల సౌకర్యం లేకుండా బాబు సర్కారు ఉత్తర్వులను జారీచేసింది .
ఈ విషయం మీద స్పందించిన శిల్పా బ్రదర్స్ మాట్లాడుతూ తమపై కక్ష్య సాధింపు చర్యలకు టీడీపీ సర్కారు దిగోతుంది .ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన నేతలపై ఇలాంటి చర్యలకే పాల్పడుతుంది .ఈ విషయం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాం అని తెలిపారు ..