ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్న అధికారంలోకి రావడం కష్టం అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు పట్టణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘అన్న సంజీవిని’ జనరిక్ మందుల దుకాణాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ వాగ్ధానాలన్నీ నీటిమీద రాతలేనన్నారు. రానున్న ఎన్నికల్లోగా ఏదొక విధంగా కేసుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. జగన్ పాదయాత్రను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ కనుమరుగవుతుందని మంత్రి అన్నారు. మంత్రి మాటలకు వైసీపీ కార్యకర్తలు,అభిమానులు,నాయకలు సోషల్ మీడియాలో కామెంట్స్ తో మండిపడుతున్నారు.
