చంద్రబాబు సర్కార్ వంటి అవినీతి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ చేసినన్ని పోరాటాలు ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేత చేయలేదని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అన్నారు. అంతేగాక ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఓ పక్క అక్రమ సంపాదన డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటూ.. వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై అప్రజాస్వామికంగా పన్నుతున్న కుయుక్తులను, కుట్రలను తిప్పికొట్టడంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవంతమయ్యారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే జోరును కొనసాగించి 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, శుక్రవారం కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడుగా మేయర్ సురేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు విసుగెత్తిపోయారని, చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు ఎవ్వరికీ ప్రజాస్వామ్యమైన అధికారం వారి చేతుల్లో లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ముందు అధికారపార్టీ పప్పులు ఉడకకపోవడంతో వైసీపీ నేతలపై పరోక్షదాడులకు సైతం పూనుకుంటుంది చంద్రబాబు సర్కార్. అంతటితో ఆగక చంద్రబాబు.. అంతా తానై.. టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని వారు విమర్శించారు.