టాలీవుడ్ అందాల భామ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ భాగమతి .అశోక్ దర్శకత్వంలో వంశీ -ప్రమోద్ కల్సి నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి .
ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు మాట్లాడుతూ బాహుబలి తో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్వీటీతో ఈ మూవీను నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు .ఇటీవల ఈ చిత్రం గురించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది ..బాహుబలి మూవీ తర్వాత వస్తున్నా సినిమా కావడంతో అభిమానుల అంచనాలకు మించే దర్శకుడు అశోక్ ఈ చిత్రాన్ని తీశారని అన్నారు .
స్వీటీ నటన ,మది కెమెరా పనితనం ,ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అందించిన బాణాలు ,నేపథ్య సంగీతం బాగున్నాయి .సరికొత్త కథ,కథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారు అని అన్నారు .