సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి లండన్ లో అరుదైన గౌరవం దక్కింది. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను ప్రఖ్యాత ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ పవన్ కి ఎక్సలెన్సీ అవార్డును అందించి సత్కరించారు. హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్కల్యాణ్కు ఈ అవార్డును అందించగా, ఆ తర్వాత పలు అంశాలపై ఈయన మాట్లాడారు. ఇక వెస్ట్ మినిస్టర్ పోర్టుక్యూలిస్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగిన సభల్లోను పాల్గొన్నారు పవన్ . ఈ రోజు వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్దులతో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. ఏదేమైన ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న పవన్ కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించడంతో ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
