చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 5టి’ని తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే బెజెల్ లెస్‌గా ఉండడంతోపాటు 18:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. దీంతో ఫుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫోన్ వరుసగా రూ.32,999, రూ.37,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల 28వ తేదీ నుంచి లభ్యం కానుంది. అమెజాన్ సైట్‌తోపాటు వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 5టి ఫీచర్లు…
6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2106 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డిరాక్ హెచ్‌డీ సౌండ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్.