ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజు అని రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కొనియాడారు.ఇవాళ మంత్రి కేటీఆర్ తో కలిసి వరంగల్ నగరంలో ఉదయం నుంచి రూ.వంద కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసారు . ఈ క్రమంలో హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు… సీఎం కేసీఆర్‌కు వరంగల్ అంటే అమితమైన ప్రేమ అని ఉద్ఘాటించారు.కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. వరంగల్‌ను సీఎం కేసీఆర్ ఎడ్యుకేషన్ హబ్‌గా తయారు చేస్తున్నారని వెల్లడించారు. వరంగల్ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయిస్తున్నారన్నారు.ఇప్పటి వరకు రూ. 600 కోట్లు కేటాయించారన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ముందున్నదన్నారు. జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన నీళ్లిస్తామన్నారు. వరంగల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడుతున్నారన్నారు.