తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి విశేష శ్రద్ధ పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూలు రాయితీ పథకాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వరంగల్‌లో ప్రారంభించారు. ఈ పర్యటనల సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ డస్ట్‌బిన్‌ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో వైద్య – ఆరోగ్యం అత్యున్నతమైన స్థాయికి చేరిందని ప్రశంసించారు. ఎమ్మెల్యే రాజయ్య కుటుంబ సభ్యులతో వైద్యసేవలు అందించడం అభినందనీయమని అన్నారు. స్టేషన్ ఘణపూర్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడుతాం..సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు. స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో అత్యున్నమైన పరిజ్ఞానంతో లెదర్ పార్క్,ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రకటించారు. రెండవ దశ టెక్స్ టెల్ పార్క్ స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో ఏర్పాటుకు కృషిచేస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు.
Post Views: 226