ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ జగన్‌కు చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు వారి వారి సమస్యలను వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులు.. తమకు పింఛన్ ఇవ్వడంలేదంటూ, యువత.. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ వదల్లేదని, అలాగే వికలాంగులు తమను చంద్రబాబు ప్రభుత్వం మరిచిందంటూ వైఎస్ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా అటుగా వస్తున్నారని తెలుసుకున్న పొలం పనులకు వెళ్తున్న మహిళా కూలీలు.. జగన్ వద్దకు భారీగా చేరుకున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌తో చెప్పుకున్నారు. డ్వాక్రా రుణాలు సరిగ్గా అందడం లేదని, రుణాలు మాఫీ కాలేదని జగన్‌ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం మహిళా కూలీలతో కాసేపు ముచ్చటించారు జగన్.
చంద్రబాబునాయుడు పొదుపు సంఘాల్లో మీరూ ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు మోసం చేశాడన్నారు.
లోను కోసం బ్యాంకుల్లో బంగారం పెట్టారా..? అంటూ జగన్ ప్రశ్నించడంతో ఆ..ఆ.. బ్యాంకుల్లో బంగారం పెట్టామంటూ చెప్పారు.
ఇదంతా చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతోనే జరిగిందని, కమ్మలైనా మిగిలాయి..? అంటూ అన్న జగన్ మాటలకు మహిళా కూలీలంతా ఒక్కసారిగా నవ్వారు. అందరికీ చెప్పండి జగనన్న ప్రభుత్వం వస్తే ఎంతైతే మనకు అప్పు ఉందో.. ఆ మొత్తాన్ని నాలుగు విడతలుగా మీకే ఇస్తామంటూ చెప్పారు వైఎస్ జగన్.