ప్రముఖ బుల్లితెర హాట్ కామెడీ జబర్ధస్త్ షోలో స్కిట్‌లు వేసే కమెడియన్ హైపర్ ఆది.. తెలుగు సినిమా క్రిటిక్ మహేష్ కత్తి మధ్య వార్ ముదురుతోంది. సోషల్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియాకి ఎక్కిన వీరిద్దరి రచ్చ.. లైవ్‌లో హైపర్ ఆది మాట్లాడిన తీరు పై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు.
అసలు విషయానికి వస్తే ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన లైవ్ లోకి వచ్చిన హైపర్ ఆది.. మహేష్ కత్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. తనకు మాత్రమే తెలిసిన చీప్ కామెడి పదాలతో టాపిక్‌ను డైవర్ట్ చేయడమే కాకుండా.. ఒక లైవ్ ప్రోగ్రాంలో చాలా చీప్‌గా మాట్లాడాడు. తెరపైకి ఒక సీరియస్ ఇష్యూ వచ్చాక కూడా.. ఆది మాటలు జబర్ధస్త్ స్కిట్‌లలో మాదిరి అన్ నెససరీ మాటలు మాట్లాడడంతో తన నిజస్వరూపం ఏంటో తెలియజేశాడు.
ఇక మహేష్ కత్తి పెట్టిన పోస్టుకు.. మాట్లాడిన మాటకు తగిన వివరణ ఇవ్వగా.. హైపర్ ఆది మాత్రం ఆద్యంతం.. వితండ వాదం చేయడమే కాకుండా తన లిమిట్స్ క్రాస్ చేస్తూ నోటి దూల ప్రదర్శిచండంతో సదరు యాంకర్ కూడా కొంత అసహనానికి గురి అయ్యారు. ఇప్పటికే తన బూతు పంచ్‌లతో బుల్లితెరని బ్రష్టు పట్టించిన హైపర్ ఆది.. లైవ్ షోలో కూడా వర్గర్ మాటలు మాట్లాడడంతో.. హైపర్ ఆదిని ఒక చీప్ మెడియన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.