దుర్వార్తలు రాసే దుర్మార్గపు పత్రికల్లారా అంటూ అచ్చతెలుగులో ఓ కవి.. ఆ రోజుల్లోనే తప్పుడు కథనాలు రాసే పత్రికల పై దమ్మెత్తి పోశాడు. అయితే ఇప్పుడు తాజాగా ఓ ఎలక్ట్రానిక్ మీడియా దిగజారుడు పై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. ఎలాక్ట్రానిక్ మీడియా తన టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి.. వేస్తున్న వేషాలు చూసి జనం కూడా మండి పడుతున్నారు.
అసలు విషయం ఏంటంటే ఓ తెలుగు ప్రముఖ వైరల్ చానల్.. ఒక బుల్లితెర హాట్ కామెడీ షోలో బూతు కమెడియన్‌ని లైవ్ ఇంటర్వ్యూకి పిలిచి డిబేట్ పెట్టింది. ఆ ఇంటర్వ్యూ అంతరార్ధం ఏంటంటే.. ఆ బూతు కమెడియన్‌కి.. తెలుగు సినిమాలకు రివ్యూలు రాసే క్రిటిక్ మధ్య జరుగుతున్న రచ్చని.. ఆ ప్రముఖ చానల్ క్యాష్ చేసుకోవడానికి లైవ్ ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఏపీలో జరిగిన కృష్ణా నది బోటు ప్రమాదం జరిగి రాష్ట్రమంతా శోక సంద్రంలో ఉంటే.. ఆ ప్రమాదం పై చర్చా కార్యక్రమాలు లేవ్.. నిపుణుల అభిప్రాయాలు లేవ్.. ప్రమాదం పై విశ్లేషనలు లవ్.. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రమాదం జరిగిన రోజున ఆ ప్రమాద టాపిక్ డైవర్ట్ చేయడానికి.. ఆ సదరు క్రిటిక్‌తో పొట్ట నెత్తి మీద బట్ట అని డిబేట్ నిర్వహించింది. దానికి కొనసాగింపుగా ఆ క్రిటిక్‌తో రగడ పెట్టుకున్న ఆ బుల్లితెర బూతు కమెడియన్‌ని లవ్‌కి పిలిచిన ఆ చానల్ తన స్థాయి ఏంటో మరోసారి చెప్పకనే చెప్పేసింది. సోషల్ మీడియాలో ఎవడెవడో ఎక్కడెక్కడో పనికిమాలిన రచ్చ పెట్టుకుంటే.. ఆ టాపిక్ తీసుకుని ఏది నిజం ఏది వైరల్ అంటూ ప్రోగ్రాంలు పెట్టడం కాదు.. వీలైతే జనాలకి నిజాలు చూపించండి లేకపోతే కామ్‌గా ఉండమని ఆ వైరల్ చానల్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.