తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గూలబీ గూటికి చేరారు .మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు .
తాజాగా అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి త్వరలోనే గూలాబీ గూటికి చేరనున్నారు .ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ను కలిశారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ ను కల్సిన అనంతరం ఉమా మాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది .భవిష్యత్తులో ఆ పార్టీకి ఇక్కడ అవకాశం లేదు .తనను కాంగ్రెస్ పార్టీలో చేరమని ఎవరు చెప్పలేదు .అయిన పోయి పోయి ఆ పార్టీలో చేరను .టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఎవరు కోరలేదు .ఒకవేళ ఎవరైనా అడిగితె తప్పకుండా ఆలోచిస్తా .కానీ తన కుమారుడు ఏ పార్టీలో చేరిన మద్దతుగా ఉంటాను అని ఆమె తెలిపారు .మీడియాతో ఆమె మాట్లాడిన తీరు త్వరలోనే గూలబీ గూటికి చేరడం ఖాయం అని అర్ధమవుతుంది .