తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని ప్రవేశపెట్టిన అద్భుత పథకం డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు .రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇండ్లను నిర్మించి తీరుతాం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి .
డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్ల నిర్మాణంపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసమే ఈ పథకాన్ని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అని ఆయన అన్నారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజక వర్గానికి రెండు వేల డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లను నిర్మించి తీరుతాం అని హామీ ఇచ్చారు .ఆ మాటను నిలబెట్టుకొని పేదలకు ఖచ్చితంగా ఇండ్లు కట్టిస్తాం అని అన్నారు .ఒకవైపు ప్రజలు ,రాజకీయ నిపుణులు ,విశ్లేషకులు కొత్త జిల్లాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం బురద చల్లే ప్రయత్నం చేస్తుంది అని ఆయన ఆరోపించారు ..