ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏమిటయ్యా అంటే… టక్కున వచ్చే సమాధానం. నంది అవార్డులు. అందులోనూ చంద్రబాబు వియ్యంకుడు, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాకు ఏకంగా తొమ్మది అవార్డులు రావడంతో హాట్‌టాపిక్ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో నిలిచింది నంది అవార్డుల ప్రకటన. అసలు లెజెండ్ సినిమాలో ఏముందనీ..? బహుశా.. లెజెండ్ సినిమాలో ఓటర్లను బెదిరించేలా ఉన్న డైలాగ్‌లను చూసి అవార్డులు ఇచ్చారేమో! అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
నంది అవార్డుల విషయాన్ని కాసేపు అటుంచితే..
ఊసరవెళ్లి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు తనకు తానే దిట్ట అని, ఆ విషయాన్ని మరో సారి నిరూపించుకున్నాడని అంటున్నారు ప్రజలు. ఇందుకు కారణం విజయవాడ ఘటనే. విజయవాడ పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ఏకంగా 12 మంది మృతి చెందినా.. అవేమీ తనకు పట్టనట్లు మరో వైపు నంది అవార్డులను ప్రకటించడమే. ఓ వైపు మృత్యు ఘోషతో ఏకంగా మూడు జిల్లాలు విచారంలో ఉంటే.. మరో వైపు తన ఇంట్లో వియ్యంకుడి నంది అవార్డుల పండగను జరుపుకునేందుకు సైతం వెనుకాడలేదు చంద్రబాబు.
ఎన్నికల సమయంలో హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ డాంబికాలు పలికి.. అధికారం చేపట్టాక ప్రత్యేక హోదాతో కాదు.. ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్ర అభివృద్ధి అని చంద్రబాబు మాట మార్చిన విషయం తెలిసిందే. అంతేకాదు. ప్రతీ ఇంటికి ఓ ఉద్యోగం, అంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపి.. ఇప్పుడేమో ప్రతీ ఒక్కకిరి ప్రభుత్వ ఉద్యోగమంటే కష్టమే మరీ అంటూ హాస్యాన్ని పండిస్తున్నారు చంద్రబాబు. ఇలా చెప్పుకుంటే చంద్రబాబు ఊసరవెళ్లి రాజకీయం చాలానే ఉంది.
ఈ క్రమంలోనే విజయవాడ పడవ ప్రమాద ఘటన అపవాదు తన ప్రభుత్వంపై పడకుండా పక్కా స్కెట్ వేశాడు చంద్రబాబు. అయితే, అది కాస్తా బెడిసికొట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇంతకీ అదేంటంటారా..? అదే నండీ నంది అవార్డులు ప్రకటన. విజవాడ ప్రమాద ఘటన జరిగిందో లేదో.. ఆ ఘటనపై ఆరా తీసిన చంద్రబాబు.. వెంటనే తెరుకుని నంది అవార్డులను హడావుడిగా ప్రకటించేశారు. ఇప్పటికే గోదావరి పుష్కరాల ఘటనతో ప్రభుత్వంపై చెడ్డపేరు ఉందని, విజయవాడ ఘటన అపవాదును కూడా ఎలాగైనా ప్రభుత్వంపై పడకుండా చేయాలన్న ఉద్దేశంతో హడావుడిగా నంది అవార్డులను ప్రకటించారని అంటున్నారు సినీ జనాలు. అయితే, చంద్రబాబు ప్లాన్ బాగానే ఉన్నా.. బెడిసి కొట్టడంతో సీన్ మొత్త రివర్సైందని చెవులు కొరుక్కుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.
ఏదేమైనా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పడవ ప్రమాదంలో ఏకంగా 12 మంది మృతి చెందినా.. కనీసం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన పాపాన పోలేదని, వియ్యంకుడిని హ్యాప్పీ చేయడం కోసం ప్రజల బాధలను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరవడంకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని చంద్రబాబుపై పెదవి విరుస్తున్నారు ప్రజలు.