అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో లేడీ యాంకర్లకు ఇతర నటులతో, తోటి యాంకర్లకు ఎఫైర్ అంటగడుతున్న ఈ రోజుల్లో.. అనసూయ మాత్రం కాంట్రవర్సీలకు ఆమడ దూరంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీలు వచ్చిన వారి జాబితాలో రష్మీని – సుధీర్‌తో, శ్రీముఖిని – రవిలు ఉన్నారు. వీరి మధ్య ఎఫైర్ పీక్ స్టేజ్‌కి వెళ్లిందంటూ పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లను ఆసరాగా చేసుకున్న పలు టీవీ యాజమాన్యాలు తమ రేటింగ్ పెంచుకునేందుకు వీరిపై ప్రోగ్రామ్‌లను కూడా టెలికాస్ట్ చేశారు. అయితే తరువాత కాలంలో అవన్నీ పుకార్లని తెలిపోయిన విషయం తెలిసిందే.
అయితే, ఓ ప్రముఖ ఛానెల్‌లో అలీ, అనసూయ యాంకర్లుగా ప్రముఖ ఛానెల్‌లో ఓ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతోన్న విషయం తెలిసిందే. ప్రోగ్రామ్‌లో భాగంగా సినిమా ప్రమోషన్ కోసమని నటుడు వరుణ్ సందేశ్, కమెడియన్స్ రాఘవ, వేణు, ఇంకా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అనసూయను ఎలా ఉన్నావ్ అంటూ పలుకరించగా.. నాకేం.. మిసెస్ అలీగా బాగానే ఉన్నానంటూ జవాబిచ్చింది. యాంకరింగ్‌లో భాగంగా పంచ్‌లు పండించేందుకు ట్రై చేసిన అనసూయ… ఈ వర్షం సాక్షిగా బజ్జీలు తింటే ఎలాగుంటది అంటూ తోటి యాంకర్, నటుడు అలీని అడుగగా.. అసలే డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో పంచ్‌లు వేసే అలీ.. బజ్జీ అంటే మధ్యలో మిరపకాయ ఉంటుంది అదేనా అని అనసూయను అడుగుతూ తన వేలును చూపించాడు అలీ. నేను మిరపకాయ అడిగానా.. బజ్జీ మీరు దేనితో చేసుకుంటే నాకేంటి.. నాకు బజ్జీ కావాలి అంతే. ఒకేనా అంటూ ఆలీ పంచ్‌కు ముగింపు పలికింది అనసూయ.