ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సర్వత్రా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటుడు ,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావడాన్ని పలువురు తప్పుపడుతున్న విషయం తెలిసిందే . ఈ వివాదం పై బాలకృష్ణ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ఎటువంటి వివాదాలు వద్దని అన్నారు.
సమష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజయవంతం అయిందని బాలకృష్ణ తెలిపారు.అందరూ కష్టపడ్డారు కాబట్టే తాను నటించిన సినిమాకు 9 అవార్డులు వచ్చాయని అన్నారు. మాటలతో కాదు చేతలతో చూపించిన సినిమా లెజెండ్ అని వ్యాఖ్యానించారు. నంది అవార్డులు ఎంపిక చేసిన వారికి కృతజ్ఞతలని అన్నారు. సాధించిన వారందరికీ అభినందనలని చెప్పుకొచ్చారు. లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదని అయన వ్యాఖ్యానించారు.