వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు షెడ్యూల్‌ను వైసీపీ పార్టీ శుక్రవారం విడుదల చేసింది.
18-11-2017న అనగా శనివారం ఉదయం 8 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన బనగానపల్లె నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. ఆపై ఉయ్యాలవాడ క్రాస్ రోడ్ మీదుగా భీమునిపాడు వద్దకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత భోజన విరామం తీసుకుని తర్వాత యాత్ర కొనసాగిస్తారు. పెరా బిల్డింగ్స్, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల బస్టాండ్ సెంటర్ మీదుగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వయా కర్రా సుబ్బారెడ్డి విగ్రహాం వద్దకు చేరుకోగానే పాదయాత్ర ముగుస్తుంది. అక్కడే ఆయన రాత్రి బస చేస్తారు.