ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో రెండు సరికొత్త ఫీచర్లను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకూ వాట్సాప్ వాయిస్‌కాల్స్ చేసుకునే వారు వీడియోకాల్ చేయాలంటే మాట్లాడుతున్న ఆ కాల్ కట్ చేసి ఆ తర్వాత వీడియో కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి వాయిస్ కాల్ మాట్లాడుతుండగానే వీడియోకాల్‌కు మారేలా సరికొత్త సదుపాయాన్ని వాట్సాప్ తీసుకురానుంది.డబ్ల్యూఏబీటీఏఇన్ఫో ప్రకారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బీటా వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోందట. కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్ తర్వాత ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా వాయిస్ కాల్స్ మాట్లాడుతున్న సమయంలోనే కాల్ కట్ చేయకుండా వీడియో కాల్‌కు మారిపోవచ్చు. ఆండ్రాయిడ్ 2.17.163 బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించింది.దీంతో పాటు మరో ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. వీడియో ప్లే అవుతున్నప్పుడు నేరుగా మ్యూట్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుందట. ఇప్పటి వరకు వీడియో ప్లే అవుతున్నప్పుడు కేవలం సౌండ్ తగ్గించుకోవడం తప్ప ఒక్కసారిగా మ్యూట్ చేసే అవకాశం లేదు. దీంతోపాటు గ్రూప్ వాయిస్‌కాల్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ఇదివరకే వాట్సాప్ ప్రకటించింది.