Home / ANDHRAPRADESH / ‘క‌మ్మ‌’ నైన నందులు.. ఎవ‌రైనా కామెంట్స్ చేస్తే కోసేస్తారా..?

‘క‌మ్మ‌’ నైన నందులు.. ఎవ‌రైనా కామెంట్స్ చేస్తే కోసేస్తారా..?

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ప్ర‌క‌టించిన నంది అవార్డుల పై త‌ర‌దైన శైలిలో వ్యంగంగా సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. అంత‌క ముందే నంది అవార్డ్స్ విష‌యంలో బ‌న్ని వాస్, గుణ‌శేఖ‌ర్‌, మారుతి, బండ్ల గ‌ణేష్‌, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి..ల‌తో పాటు మ‌రికొంద‌రు నంది అవార్డుల పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ వివిధ మాధ్య‌మాల ద్వారా స్పందించిన సంగ‌తి తెలిసిందే.

అయితే నంది అవార్డ్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి ఎన్ని కామెంట్స్ వ‌చ్చినా.. స్పందించ‌ని నంది అవార్డ్స్ క‌మెటీ.. తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ పెట్టిన పోస్టు పై నంది అవార్డ్స్ క‌మెటీ మెంబ‌ర్ మ‌ద్దినేని ర‌మేష్ బూతు ప‌ద‌జాలాన్ని ఉపయోగిస్తూ.. లం*కొడ‌కా, ఖ‌ర్మ‌నా కొడ‌కా, బ‌ర్మ‌నా కొడ‌కా, బచ్చా నా కొడ‌కా, రమ్మీ నా కొడకా.. తెలుగుజాతి ఖర్మ నా కొడకా… నంది క‌మిటీ గురించి మాట్లాడితే ఎవడికేం కొయ్యాలో అది కోస్తాంరా రెయ్ వ‌ర్మ అంటూ పోస్టు పెట్టారు.

దీంతో వెంట‌నే స్పందించిన వ‌ర్మ.. ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుంది. అలాగే నేను నంది అవార్డులు ఇచ్చిన వైనం పై స్పందించాను. నన్ను తిట్టినందుకు నాకేం బాధ లేదు.. కానీ ఇలాంటి వ్యక్తులని అవార్డ్ కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు.. అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలి అని వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందిచారు. దీంతో ఏపీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో నంది ర‌గ‌డ ఏ ములుపు తీసుకుంటుందో అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat